వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో ఉన్న వై కన్వెన్షన్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులు తీర్చడానికి కాల్ యువర్ ఎమ్మెల్యే పేరిట 7075527666 నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కడే కాల్ యువర్ ఎమ్మెల్యేకి శ్రీకారం చుట్టారు.