మార్కాపురంలో కొండచిలువ కలకలం
మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో శుక్రవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. యార్డు ఆవరణలో కొండచిలువ సంచరిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారి స్నేక్ క్యాచర్ నిరంజన్ కొండ చిలువను బంధించారు. తర్వాత స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని ఆయన తెలిపారు. కొండచిలువ 7 అడుగులకు పైగా ఉన్నట్లుగా తెలిపారు.