మాచర్ల: నాగార్జునసాగర్ లో కోతుల స్వైర విహారం

81பார்த்தது
మాచర్ల మండలం పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ విజయపురి సౌత్ లో రోజురోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతుందని మంగళవారం స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, మహిళలు, వృద్ధులపై కోతులు దాడి చేయడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లపై గుంపులు గుంపులుగా సంచరించి పలువురిని గాయపరిచిన ఘటనలు ఉన్నాయంటూ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி