గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ

53பார்த்தது
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో శనివారం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో అమ్మవారికి పూజలు చేశారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయుధాగారంలో ఎస్పీ సతీశ్ కుమార్ చేతులమీదుగా ఆయుధ పూజ చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

தொடர்புடைய செய்தி