అర్ధవీడు: ప్రభుత్వ మద్యం దుకాణానికి తాళం
ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గురువారం తాళం వేశాడు. ప్రభుత్వ మద్యం దుకాణానికి సంబంధించి సంవత్సరం నుంచి అద్దె చెల్లించడం లేదంటూ నిరసన తెలిపాడు. సమాచారాన్ని అందుకున్న ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకొని దుకాణ యజమానితో మాట్లాడి సముదాయించారు. అద్దె డబ్బులు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో దుకాణదారుడు నిరసన విరమించాడు.