దేశంలో డ్వాక్రా సంఘాలకు ఆద్యుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆ సంఘాలు చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలోని 224 మంది డ్వాక్రా సభ్యులకు మంజూరైన రూ.3.47 కోట్ల విలువ గల చెక్కును ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలు జీవన ప్రమాణాలను పెంచుకోవాలన్నారు.