కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఈనెల 13వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో రాజ్యలక్ష్మి శుక్రవారం తెలియజేశారు. సమావేశం హాలు నందు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో ఆయా శాఖల పై సమీక్ష ఉంటుందని ఎంపీడీవో తెలిపారు. అధికారులందరూ సమగ్ర నివేదికతో హాజరుకావాలని కోరారు. ఎంపీటీసీలు, జడ్పిటిసి, సర్పంచులు హాజరుకావాలని తెలిపారు.