బల్లికురవ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా వినతిపత్రాలు అందజేయవచ్చని తహశీల్దార్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.