అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో తిమ్మా నాయుడు పర్యవేక్షించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.37,41,594 వచ్చినట్లు ఈవో చెప్పారు. భక్తులు, అధికారుల పర్యవేక్షణలో ఆదాయం లెక్కింపు జరిగినట్లు ఆయన తెలిపారు.