ఉరవకొండ ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాల ఆవరణంలో టపాసుల విక్రయాలకు అనుమతి మంజూరు చేయడాన్ని రాయలసీమ విద్యార్థి యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భీమేష్ మరియు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ వ్యతిరేకించారు. వారు ఉరవకొండ మండల డిప్యుటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు, విద్యాసంస్థల ఆవరణలో టపాసులు విక్రయించకూడదని స్పష్టం చేశారు.