మిలాద్ ఉన్ నబీ సందర్భంగా చిట్వేలి మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శలవు ప్రకటించినట్లు చిట్వేలి మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండవ శనివారం, ఆదివారం విద్యార్థులకు సెలవు ఉన్నప్పటికీ సోమవారం ముస్లిం మత ప్రవక్త మహమ్మద్ నబీ జన్మదినం సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించినట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు.