వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి నాల్గవ వర్థంతి సందర్భంగా గురువారం ఆమె నివాళులు అర్పించారు. పులివెందుల పట్టణంలోని డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్ ఫ్యామిలీ సమాధుల తోటలో ఆయన సమాధికి ఆయన భార్య సుగుణమ్మ, వైఎస్ భారతి రెడ్డి, కుమారుడు దినేష్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.