తొండూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం 1985-86 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు ఒకచోట కలుసుకుని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను పూర్వపు విద్యార్థులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.