జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఎంపీ వైఎస్ అవినాశ్ పేర్కొన్నారు. గురువారం పులివెందులలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో ఎంపీకి అందించారు. సమస్యలు తీర్చడానికి అధికారులతో మాట్లాడుతానని ఎంపీ అర్జీదారులకు తెలిపారు.