చాపాడు మండలం మడూరు గ్రామంలో 11 కేవి విద్యుత్ తీగలు అత్యంత ప్రమాదకరంగా వేలాడుతుండటంపై గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో భూమికి రెండు మీటర్ల ఎత్తులో తీగలు ఉన్నాయని, ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఎమ్మెల్యే విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.