రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు పారదర్శకంగా ఇసుక సరఫరాను చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం పెండ్లిమర్రి మండలం కొత్తగంగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీలో ఇసుక క్వారీని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ప్రారంభించారు. అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.