యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులు తప్పెట రామ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా విధుల నుంచి రిలీవ్ చేయాలని ఉపకులపతిని కొద్దిరోజుల కిందట కలిసి కోరారు. ఆయన విజ్ఞాపన మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ విధుల నుంచి సోమవారం రిలీవ్ చేసినట్టు వైవియూ ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి వెల్లడించారు.