విడపనకల్లు మండలంలోని ఎరువుల దుకాణాలను మంగళవారం ఏవో పెన్నయ్య ఆధ్వర్యంలో ఇంటర్నల్ స్క్వాడ్ ఏడీఏ వెంకట రాయుడు తనిఖీలు చేశారు. ఏడీఏ వెంకట రాయుడు, ఏవో పెన్నయ్య మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆరు ఎరువుల దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ ఉండటంతో రూ. 5, 60, 000 విలువ గల ఎరువులను సీజ్ చేశామన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలని సూచించారు.