ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం ఈ నెల 21వ తేది నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ శుక్రవారం విలేఖరులతో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మీనుగ లలిత అధ్యక్షతన సమావేశం జరుగుతుందని అన్నారు. సమావేశానికి పాలకవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు హాజరు కావాలని కోరారు.