నార్పల మండలం సిద్ధరాచర్ల పంచాయతీ నందు గ్రామాల్లో ప్రజలకు 104 సేవలు అందిస్తూ డెంగ్యూ వ్యాధి నివారణకు ముందస్తు చర్యలను సిద్ధారాచర్ల సర్పంచ్ సాకే రామాంజినేయులు బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామాల్లో పసి పిల్లలు ఉన్నచోట మురికి నీరు, అదేవిధంగా టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు నందు నిలువ ఉన్న నీరును వులకబోస్తూ, దోమల నివారణ పొగను గ్రామాల్లో పిచికారి చేస్తూ డెంగ్యూ నివారణ కోసం ముందస్తు చర్యలు చేపట్టామన్నారు.