మడకశిర నియోజకవర్గంలో 10వేల ఎకరాలలో సోలార్ పార్క్ ఏర్పాటు కోసం శనివారం భూమిని పరిశీలించారు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు. వర్షాలు లేక కరువుతో అల్లాడుతూ సమయానికి పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్నలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చొరవ తీసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళగా వారు సోలార్ పార్క్ ఏర్పాటు చేయడానికి హామీ ఇవ్వడంతో భూములను పరిశీలించారు.