పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం శెట్టూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. శెట్టూరు మండలం కైరేవు గ్రామంలో విజయదశమి రోజు ఘర్షణ జరిగింది. ఈ మేరకు తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని తండ్రి పాతలింగప్ప పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆయనను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.