కళ్యాణదుర్గం పట్టణంలోని జయనగర్ కాలనీలో శనివారం గుజిరితో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి మురికి కాలువలో పడింది. విద్యుత్ స్తంభంకు ఐచర్ ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. దీంతో విద్యుత్ స్తంభానికి ఉన్న వైర్లు తెగిపోవడంతో విద్యుత్ అధికారులు వచ్చి వైర్లను సరి చేశారు. ఆ రహదారిపై చిన్నపిల్లల స్కూల్ బస్సులు కూడా వస్తుంటాయి. ఐచర్ వాహనం కాలువలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం జరిగింది.