కంబదూరు మండలం నూతిమడుగు సమీపంలోని పెన్నానదిపై ఉన్న బ్రిడ్జి మధ్యలో కూలిపోయిందని గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో శనివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పరిశీంచారు. బ్రిడ్జి పై ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడు, నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.