కదిరి: ఎమ్మెల్యే కందికుంటని ఘనంగా సన్మానించిన భవన కార్మికులు

58பார்த்தது
శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం భవన నిర్మాణ కార్మికులు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలకి ఉచిత ఇసుక అందుబాటులో తేవడంతో చాలా ఆనందంగా వుందని కూటమి ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி