గుత్తి చెరువులో ఏడేళ్ల తర్వాత తెప్పోత్సవం ఆదివారం నిర్వహించారు. ఏడేళ్ల నుంచి గుత్తి చెరువులో నీళ్లు లేకపోవడంతో సరిగా నిర్వహించడం లేదని, ఈ ఏడాది ఎక్కువ వర్షాలు కురిసి నీరు చేరడంతో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు తెలిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై విహరింపజేశారు.