అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవనంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ శనివారం ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ చేశారు. 5, 6, 7, 8 తేదీల్లో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. మొదటి రోజు సమావేశంలో.. వక్తలు మాట్లాడుతూ.. దేశంలో ప్రాథమిక విద్య పూర్తి స్థాయిలో నాశనం అయింది అన్నారు. పాఠశాలలు మూతపడ్డాయని, చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓతూరు పరమేష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.