సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రజల కోసమే పని చేస్తారన్నారు.