నార్పల మండలంలో ఈనెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ గంగావతి సోమవారం పేర్కొన్నారు. 22న కేసేపల్లి, 23న చామలూరు, 24న నడిమి దొడ్డి, 25న నాయన పల్లి గ్రామ సచివాలయాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు ఆధార్ నమోదు, మార్పులు, చేర్పులు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.