తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన శింగనమల నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే టాప్ లో నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె పార్టీ బూత్, క్లస్టర్, యానిట్, ఇన్చార్జీలు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగహన సదస్సు నిర్వహించారు.