అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట పంచాయతీలో జరుగుతున్న కాలువల పూడిక తీత పనులను రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో మంగళవారం పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా కాలువల్లో పూడిక తీత చేపట్టిందన్నారు.