పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. ఎలమంచిలి మండలం బయ్యవరం, ఏటికొప్పాక గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారులు రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. రైతులు సమగ్ర యాజమాన్యం పద్ధతులు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పలనాయుడు పాల్గొన్నారు