విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎలమంచిలిలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఎ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. బాలాజీ, డివిజన్ అధ్యక్షుడు కేశవ, కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్నారు.