సింహాచలం గిరిప్రదక్షిణలో ప్రత్యేక ఆకర్షణగా నారసింహస్వామి పుష్పరథం నిలిచింది. అంగరంగవైభవంగా స్వామి వారి రథార్ని వివిధ పుష్పాలతో శనివారం అలంకరించారు. రథానికి పూజలు నిర్వహించారు. తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్ జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్కు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, మీదుగా తిరిగి రథం సింహాచలం చేరుకొనేలా ఏర్పాట్లు చేశారు.