అనకాపల్లి జిల్లాలో ఫార్మా కంపెనీలలో పనిచేస్తున్న ప్రజల భద్రత కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్షణ యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం పరవాడలో బైక్ యాత్ర వాల్ పోస్టర్ ను సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా నాయకుడు వివి రమణ ఆవిష్కరించారు. ఈనెల 20న బైక్ యాత్ర అచ్యుతాపురం చేరుకుంటుందన్నారు.