వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని 108 సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్. రాయవరంలో గురువారం సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాసరావు, సత్యనారాయణ మాట్లాడుతూ.. 108ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. పీఎఫ్ యాజమాన్యం వాటా సంస్థ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.