కోటవురట్ల మండలంలో పశుగణన సర్వే కొనసాగుతున్నట్లు స్థానిక పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెట్ల నరేశ్ గురువారం తెలిపారు. గత నెల 18న ప్రారంభమైన ఈ సర్వే ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. సర్వేలో మూగజీవాల వివరాలను సేకరించి నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పశువులు మేకలు గొర్రెలు కోళ్లకు సంబంధించిన వివరాలు రైతులు, ప్రజలు సర్వే సిబ్బందికి తెలియజేయాలన్నారు.