పాయకరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోని తాతారావు మంగళవారం మండలంలోని అరట్లకోట, మంగవరం, సత్యవరం, మాసాహేబుపేట గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సఖిలేటి దుర్గాప్రసాద్, కీర్తి శ్రీను, పిండి కొండబాబు, విశ్వనాధం, సత్తిబాబు, గారా శ్రీను తదితరులు పాల్గొన్నారు.