ఎన్నికల ప్రచారం నిర్వహించిన చిక్కాల

85பார்த்தது
ఎన్నికల ప్రచారం నిర్వహించిన చిక్కాల
పాయకరావుపేట మండలం గుంటుపల్లిలో ఆదివారం జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల రామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్ధి కంబాల జోగులు, ఎంపి అభ్యర్ధి బూడి ముత్యాలనాయుడులను అత్యధిక మెజరిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్యాల లక్ష్మణరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబూరావు, సర్పంచ్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி