ఏపిలో ఇటీవల సంభవించిన వరదలలో దెబ్బ తిన్న బాధితులను, ప్రాంతాలను ఆదుకునేందుకు చోడవరం శ్రీ గణేష్ గాయిత్రి బ్రాహ్మణ సేవా సంఘం వారు 42, 500 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పుట్రేవు శ్యాంప్రసాద్, ఉపాద్యాయుల శ్రీనివాస రావు, కార్యదర్శి వింజమూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.