రాంబిల్లి మండలం కొత్తూరులో గ్రామ దేవత పండగ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం రాత్రి బహుమతులు అందజేశారు. విన్నర్ గా నిలిచిన ప్రకాశం జిల్లా జట్టుకు రూ. 30, 000, రన్నర్ గా నిలిచిన తూ. గో జిల్లా జట్టుకు రూ. 25, 000, మూడవ స్థానంలో నిలిచిన విశాఖ జట్టుకు రూ. 15, 000 నగదు బహుమతులను అందజేశారు. అలాగే కోలాటంలో విజేతలకు కూడా బహుమతులు ఎమ్మెల్యే అందించారు.