సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం అచ్యుతాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి నేతృత్వం వహించిన సిపిఎం మండల కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలన్నారు. ట్రూఅప్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు.