విశాఖ: సెక్యూర్టీ గార్డులకు జీతాలు చెల్లించాలి
విశాఖ కేజీహెచ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ ఉద్యోగులకు గత 2 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు, కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదని కేజీహెచ్ సెక్యూరిటీ గార్డు యూనియన్ గౌరవ అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్, వర్కింగ్ ఉమెన్ సంఘం నాయకులు పి. మణి పేర్కొన్నారు. సోమవారం సీఐటీయూ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్మికులపై వేధింపులు గురిచేస్తోన్నారన్నారు.