బిజెపి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించొద్దని ఆదేశాలు ఇవ్వడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఫీసర్లకు, పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలివ్వకుండ ఆర్ధికంగా దెబ్బతీసే కుట్రలు కేంద్ర బిజెపి ప్రభుత్వం చేపట్టడం దుర్మార్గమన్నారు.