విశాఖ వాతావరణ కేంద్రం మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది, ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.