విశాఖలోని నేవెల్ డాక్ యార్డ్ సమీపాన గల పైపులెన్ వద్ద కోరమండల్ సంస్థకు చెందిన భారీ ట్రక్ బోల్తా పడింది. గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు పది అడుగుల ఎత్తు నుండి ట్రాక్‌లోని పైపులు పడిపోయాయి. దీంతో ట్రక్ కూడా అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మూడు గంటలు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.