సచివాలయ భద్రతా సిబ్బందికి కీల‌క‌ ఆదేశాలు

65பார்த்தது
సచివాలయ భద్రతా సిబ్బందికి కీల‌క‌ ఆదేశాలు
తెలంగాణ సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉందని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. స‌చివాల‌య‌ సిబ్బంది కదలికలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉందని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావాలని సూచించారు. ప్రభుత్వం, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు షేర్‌, లైక్‌ చేయవద్దని, తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

தொடர்புடைய செய்தி