విశాఖ జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియను సోమవారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో నిర్వహించారు. విఎంఆర్టిఏ చిల్డ్రన్ ఏరియాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 150 మద్యం షాపులకు 3139 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. లాటరీలో తగిలిన నెంబర్లు ఆధారంగా షాపులు కేటాయించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.