ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1. 0 పథకంలో లబ్ధిపొందిన వారికి 2. 0లో గృహ సంబంధిత పథకంలో అవకాశం ఉండదని, ఇప్పుడు మంజూరైన ఇళ్లను ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇతర అంశాలపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మార్గనిర్దేశకాలు జారీ చేశారు.