కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లోనే గ్రామాలలో పల్లె పండుగ పేరుతో పండగ వాతావరణం నెలకొందని ఫలితంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆయన మాడుగుల మండలంలోగల గాదిరాయి, వొమ్మలి, సత్యవరం, వీరనారాయణo గ్రామాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.